న్యాయ విద్యలో నాణ్యత కీలకం:టి.గవర్నర్

- August 17, 2020 , by Maagulf
న్యాయ విద్యలో నాణ్యత కీలకం:టి.గవర్నర్
హైదరాబాద్:భాగ్యదేశంలో కోర్టులలో పెరిగిపోతున్న కేసుల సంఖ్య ఆందోళన కనిగిస్తున్నదని, న్యాయ విద్యలో నాణ్యత పెంచడం కీలకాంశమని గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ అన్నారు.పెరుగుతున్న టెక్నాలజి, కుటుంబ సభ్యుల సమస్యల నుండి మొదలు అంతర్జాతీయ స్థాయి సమస్యలు కొత్త సవాళ్ళు విసురుతున్నాయి. విషయ పరిజ్ఞానం, లోతైన అవగాహన, నైపుణ్యాలున్న న్యాయ విద్యార్ధులను తీర్చిదిద్దడానికి న్యాయ విద్య పరిధి విస్తృతం కావాలని డా. తమిళిసై అన్నారు. 
 
“న్యాయ విద్య, పరిశోధన – కోవిడ్ సమాళ్ళు” అన్న అంశంపై ఉస్మానియా యూనివర్సిటి న్యాయకళాశాల ఆధ్వర్యంలో మొదలైన 10 రోజుల ఆన్ లైన్ కార్యశాలను గవర్నర్ ముఖ్య అతిధిగా ఈరోజు ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ కోవిడ్ మొత్తం విద్యారంగానికే సవాలు విసిరిందని, ఐతే లాక్ డౌన్ విద్యా సంస్ధలకే కానీ విద్యకు కాదన్నారు. ప్రతీ సమస్య కొన్ని కొత్త అవకాశాలను సృష్టిస్తుందని, అలాగే కోవిడ్ సంక్షోభం కూడా విద్యా రంగంలో కొత్త తరహా ఆన్ లైన్, డిజిటల్ లర్నింగ్, టీచింగ్ అవకాశాలను కల్పించిందన్నారు.
 
కొత్తగా వస్తన్న జాతీయస్థాయి లా స్కూల్స్ కు ధీటుగా సంప్రదాయ విశ్వవిద్యాలయ లా కళాశాలలు కూడా సిలబస్ రూపకల్పన, వసతులు సమకూర్చుకొని అత్యుత్తమ న్యాయ విద్యను అందించాలని డా. తమిళిసై పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో రిజిస్ట్రార్ ప్రొ. సిహెచ్. గోపాల్ రెడ్డి, న్యాయ విభాగం హెడ్ ప్రొ. గాలి వినోద్ కుమార్, లా డీన్ ప్రొ. పంత్ నాయర్, ప్రొ. జిబి రెడ్డి, ప్రధాన వక్త ప్రొ. వెంకట రావ్, డా. విజయ లక్షి, డా. రాధిక యాదవ్ తదితరులు పాల్గొన్నారు. 
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com