కువైట్:ప్రతి బుధవారం ఓపెన్ హౌస్ మీటింగ్..భారత్ రాయబార కార్యాలయం ప్రకటన
- August 18, 2020
కువైట్ సిటీ:ఇక నుంచి ప్రతి బుధవారం ఓపెన్ హౌజ్ మీటింగ్ నిర్వహించనున్నట్లు కువైట్ లోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. రేపు (ఆగస్ట్ 19) తొలి సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించింది. భారత రాయబార కార్యాలయం ప్రాంగణంలోనే నిర్వహించనున్నా ఓపెన్ హౌజ్ మీటింగ్ లో భారత రాయబారి/మిషన్ డిప్యూటీ అధికారి, సంక్షేమ సంఘాల అధ్యక్షులు, కార్మిక శాఖలకు చెందిన అధికారులు పాల్గొంటారు. అయితే..బుధవారపు ఓపెన్ హౌజ్ మీటింగులు..కౌన్సిలర్ ఆఫీస్ లో నిర్వహించే రోజువారి సమావేశాలకు అదనంగా నిర్వహిస్తున్నట్లు కూడా రాయబార కార్యాలయ అధికారులు స్పష్టతనిచ్చారు. ఇదిలాఉంటే కరోనా నేపథ్యంలో బుధవారపు సమావేశాలకు ఆరోగ్య శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకోనున్నట్లు వివరించారు. భౌతిక దూరం పాటించేందుకు వీలుగా పరిమిత సంఖ్యలోనే జనాలను అనుమతిస్తారు. [email protected].లో ముందుగా ఎవరు రిజస్టర్ చేసుకుంటే వారికే తొలిగా అనుమతి లభిస్తుంది. అనుమతికి సంబంధించి రిజిస్టర్ చేసుకున్న వారికి సమాచారం అందిస్తారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!
- న్యూయార్క్ డిక్లరేషన్ ను స్వాగతించిన ఒమన్..!!
- తట్టై హిందూ కమ్యూనిటీ రక్తదాన శిబిరం..!!
- AI ఉపయోగించి కాపీరైట్ ఉల్లంఘన.. SR9000 జరిమానా
- ఖతార్ పీఎం తో అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ సమావేశం..!!
- కువైట్ లో 269 మంది అరెస్టు..!!
- మహిళల హకీ ఆసియా కప్లో ఫైనల్కు భారత్
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!