పిసిఆర్‌ టెస్ట్‌ ధర తగ్గించిన అబుధాబి

- September 10, 2020 , by Maagulf
పిసిఆర్‌ టెస్ట్‌ ధర తగ్గించిన అబుధాబి

అబుధాబి:అబుధాబి హెల్త్‌ సర్వీసెస్‌ కంపెనీ (సెహా), కరోనా పిసిఆర్‌ టెస్టుల ధరను 250 దిర్హామ్ లకు తగ్గించింది. గతంలో ఈ ధర 370 దిర్హామ్ లుగా వుండేది. ఆర్‌టి-పిసిఆర్‌ టెస్ట్‌ని పిసిఆర్‌ టెస్ట్‌గా పిలుస్తున్నారు. రియల్‌ టైం రివర్స్‌ ట్రాన్స్‌స్క్రిప్షన్‌ పాలమరైజ్‌ చెయిన్‌ రియాక్షన్‌.. దీని అసలు పేరు. కోవిడ్‌ 19 నేపథ్యంలో ఈ టెస్ట్‌ని ప్రముఖంగా వినియోగిస్తున్నారు. నాసల్‌ స్వాబ్‌ నమూనాల ద్వారా ఈ టెస్ట్‌ చేస్తారు. ఆర్‌టి-పిసిఆర్‌ కాకుండా మరికొన్ని విధానాలనూ కరోనా నిర్ధారణ కోసం వినియోగిస్తున్నారు. అయితే, అన్నిటిలోకీ ఆర్‌టి-పిసిఆర్‌ అత్యంత విశ్వసనీయమైనది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com