ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం
- September 10, 2020
దోహా: వీకెండ్‌లో ఉరుములతో కూడిన వర్షాలు కొన్ని చోట్ల పడే అవకాశాలున్నట్లు ఖతార్ మిటియరాలజీ డిపార్ట్‌మెంట్ పేర్కొంది. పెద్దయెత్తున గాలి దుమారం కూడా చెలరేగే అవకాశాలున్నాయని మిటియరాలజీ డిపార్ట్‌మెంట్ సూచిస్తోంది. స్థానికంగా ఏర్పడ్డ మేఘాలతో అప్పటికప్పుడు భారీ వర్షాలు కురిసే అవకాశం వుంటుంది. ఈ నేపథ్యంలో విజిబిలిటీ గణనీయంగా తగ్గిపోతుంది. వాహనదారులు అప్రమత్తంగా వుండాలని సూచించింది. ఉష్ణోగ్రతలు 31 డిగ్రీల సెల్సియస్ నుంచి 40 డిగ్రీల సెల్సియస్ వరకూ నమోదవ్వొచ్చు. శుక్ర, శనివారాల్లో వాతావరణం ఒకే రకంగా వుండొచ్చు. కాగా, ‘వాస్మి’ సీజన్ అక్టోబర్ మధ్యలో ప్రారంభమయ్యే అవకాశం వుందని ఖతార్ మిటియరాలజీ డిపార్ట్‌మెంట్ అంచనా వేస్తోంది.
--రాజ్ కుమార్ వనంబత్తిన (మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







