కువైట్-ఇండియా ఫ్లైట్ షెడ్యూల్ ప్రకటించిన అల్ తాయార్ ట్రావెల్స్
- September 10, 2020
కువైట్ సిటీ:స్వదేశానికి వెళ్లాలనుకుంటున్న కువైట్ లోని ఇండియన్ల కోసం ప్రత్యేక విమాన సర్వీసులను కొనసాగిస్తున్నట్లు అల్ తాయార్ లగ్జరీ ట్రావెల్స్ ప్రకటించింది. కువైట్ నుంచి భారత్ లోని ఆరు నగరాలకు మొత్తం ఎనిమిది సర్వీసులు నడుపుతున్నట్లు ట్రావెల్స్ ప్రతినిధులు వెల్లడించారు. ముంబై, ఢిల్లీకి రెండు సర్వీసులు, హైదరాబాద్, కొచ్చి, త్రివేండ్రం, చెన్నైకి ఒక్కో చార్టర్డ్ విమానం చొప్పున ఈ నెల 12 నుంచి సర్వీసులు ప్రారంభం కానున్నాయి. అయితే..ప్రయాణికులు పీసీఆర్ నెగటీవ్ రిపోర్ట్ సమర్పించాల్సి ఉంటుంది.
అల్ తాయార్ సంస్థ ప్రకటించిన చార్టెర్డ్ ఫ్లైట్ షెడ్యూల్ వివరాలు :
సెప్టెంబర్ 12 - ఢిల్లీ, సెప్టెంబర్ 17- ముంబై, సెప్టెంబర్ 20- చెన్నై, సెప్టెంబర్ 22- హైదరాబాద్, సెప్టెంబర్ 21- ముంబై, సెప్టెంబర్ 25 - కొచ్చి, సెప్టెంబర్ 26-త్రివేండ్రం, సెప్టెంబర్ 30- ఢిల్లీకి ప్రత్యేక విమాన సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి.
టికెట్లు బుక్ చేసుకోవాలనుకునే వారి కోసం పలువురు ఆపరేటర్లను ఫోన్ నెంబర్ల కూడా ట్రావెల్స్ సంస్థ వెల్లడించింది. వసీం - 99696767, యాసర్ - 67041981, సలీమ్ - 97122364, యూసుఫ్ - 96677516, లినెట్-99691151, అతుల్ - 97313355 , మాథ్యు - 99696769కి ఫోన్ చేసి టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







