అబుధాబిలో రోడ్డు ప్రమాదం..ముగ్గురు అసియన్లు మృతి, ఇద్దరికి గాయాలు

- September 22, 2020 , by Maagulf
అబుధాబిలో రోడ్డు ప్రమాదం..ముగ్గురు అసియన్లు మృతి, ఇద్దరికి గాయాలు

అబుధాబిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. బాధితులు అంతా అసియా దేశాలకు చెందిన వారేనని అబుధాబి పోలీసులు వెల్లడించారు. యాక్సిడెంట్ లో చనిపోయిన వారి మృతదేహాలను మార్చురీకి తరలించారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.  అబుధాబిలోని అల్ ఫయా-సాయిహ్ షుయబ్ రోడ్డులో మంగళవారం ఉదయం రెండు బస్సులు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. చిన్న బస్సు నడుపుతున్న డ్రైవర్..అటెన్షన్ కొల్పోవటంతో పక్క లేన్ లో వస్తున్న పెద్ద బస్సును ఢీ కొట్టినట్లు అబుధాబి పోలీసులు తమ అధికారిక ఫేస్ బుక్ లో వివరించారు. క్షణం పాటు ఆదమరవటంతో ఈ ప్రమాదం జరిగిందన్నారు. అందుకే వాహనదారులు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ముఖ్యంగా ప్రస్తుత మంచు కురిసే పరిస్థితుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. 

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com