భారత్:ఒక్క రోజులో 86,052 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
- September 25, 2020
న్యూ ఢిల్లీ:భారత్‌లో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు కొనసాగిస్తున్నారు. తాజాగా నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో దాదాపు 15 లక్షల పరీక్షలు నిర్వహించారు. ఒక్క రోజు వ్యవధిలో ఇన్ని టెస్టులు చేయడం ఇదే తొలిసారి. నిన్న చేసిన పరీక్షల్లో 86,052 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో శుక్రవారం నాటికి నమోదైన మొత్తం కేసుల సంఖ్య 58,18,570కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. వీరిలో నిన్న 81 వేల మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కోలుకున్న వారి సంఖ్య 47 లక్షల 56 వేలకు చేరింది. మరో 9 లక్షల 70 వేల క్రియాశీల కేసులు ఉన్నాయి. ఇక రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ, మరోపక్క కరోనా సోకి మరణిస్తున్నవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది. రోజుకి దాదాపు 1100 మందికి పైగా ప్రాణాలు కోల్పోతున్నారు. నిన్న ఒక్కరోజే 1141 మంది కరోనాతో మరణించారని ప్రభుత్వం పేర్కొంది. దీంతో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 92,290కి చేరింది. అయితే వైరస్ సోకి మరణిస్తున్న వారిలో 70 శాతం మంది ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారేనని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రికవరీ రేటు 81 శాతం కాగా, మరణాల రేటు 1.59 శాతంగా ఉంది.
తాజా వార్తలు
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ







