అక్టోబర్‌ 1 నుంచి ఇండియాకి మరిన్ని విమాన సర్వీసులు

- September 25, 2020 , by Maagulf
అక్టోబర్‌ 1 నుంచి ఇండియాకి మరిన్ని విమాన సర్వీసులు

మస్కట్‌:వందే భారత్‌ మిషన్‌లో భాగంగా, ఒమన్‌ నుంచి ఇండియాకి మరిన్ని విమానాలు అక్టోబర్‌ 1 నుండి ప్రారంభం కానున్నట్లు ఇండియన్‌ ఎంబసీ పేర్కొంది. అక్టోబర్‌ 1 నుంచి అక్టోబర్‌ 24 మధ్య మొత్తం 45 విమానాలు ఒమన్‌ - ఇండియా మధ్య తిరగనున్నాయి. కేరళ, ముంబై, చెన్నయ్‌, బెంగళూరు, లక్నో మరియు ఢిల్లీలకు ఈ విమానాలు నడుస్తాయి. మెడికల్‌ ఎమర్జన్సీ కేసులు, ప్రెగ్నెంట్‌ విమెన్‌, డిస్ట్రెస్‌లో వున్న వర్కర్స్‌, సీనియర్‌ సిటిజన్స్‌, ఇబ్బందికర పరిస్థితుల్లో చిక్కుకుపోయిన భారతీయులకు ఎక్కువ ప్రాధాన్యత లభిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com