అంత‌ర్జాతీయ విమానాల‌పై మ‌ళ్లీ నిషేధం పొడిగింపు-DGCA

- October 28, 2020 , by Maagulf
అంత‌ర్జాతీయ విమానాల‌పై మ‌ళ్లీ నిషేధం పొడిగింపు-DGCA

న్యూఢిల్లీ: అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసులు మ‌రో నెల రోజుల‌పాటు పునఃప్రారంభ‌మ‌య్యే అవ‌కాశం లేదు. అంత‌ర్జాతీయ క‌మర్షియ‌ల్ విమానాల రాక‌పోక‌ల‌పై ఇప్ప‌టికే అమ‌ల్లో ఉన్న స‌స్పెన్ష‌న్‌ను 2020, న‌వంబ‌ర్ 30 వ‌ర‌కు పొడిగిస్తున్న‌ట్లు ది డైరెక్ట‌రేట్ జ‌న‌ర‌ల్ ఆఫ్ సివిల్ ఏవియేష‌న్ (DGCA) బుధ‌వారం ప్ర‌క‌టించింది. యూర‌ప్ దేశాల్లో క‌రోనా వైరస్ మ‌రోసారి విస్త‌రిస్తున్న నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు DGCA తెలిపింది. అయితే అన్ని ర‌కాల అంత‌ర్జాతీయ కార్గో స‌ర్వీసుల‌కు, తాము అనుమతించిన ప్ర‌త్యేక విమాన స‌ర్వీసుల‌కు ఈ నిషేధం వ‌ర్తించ‌ద‌ని డీజీసీఏ స్ప‌ష్టం చేసింది.

అయితే, ఎంపిక చేసిన కొన్ని ప్ర‌త్యేక మార్గాల్లో మాత్రం అంత‌ర్జాతీయ క‌మ‌ర్షియ‌ల్ విమాన స‌ర్వీసుల‌ను అనుమ‌తిస్తున్న‌ట్లు DGCA పేర్కొన్న‌ది. కాగా, క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ఈ ఏడాది మార్చి 23న అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసుల రాక‌పోక‌ల‌పై DGCA నిషేధం విధించింది. అయితే, ఇప్ప‌టికీ క‌రోనా విస్తృతి త‌గ్గ‌క‌పోవ‌డంతో ప‌లు ద‌ఫాలుగా గ‌డ‌వును పొడిగిస్తూ వ‌చ్చింది. ఇటీవ‌ల విధించిన నిషేధం గ‌డువు అక్టోబ‌ర్ 31న ముగియనుండ‌టంతో తాజాగా మ‌రోసారి నిషేధాన్ని పొడిగించింది. ‌    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com