అంతర్జాతీయ విమానాలపై మళ్లీ నిషేధం పొడిగింపు-DGCA
- October 28, 2020
న్యూఢిల్లీ: అంతర్జాతీయ విమాన సర్వీసులు మరో నెల రోజులపాటు పునఃప్రారంభమయ్యే అవకాశం లేదు. అంతర్జాతీయ కమర్షియల్ విమానాల రాకపోకలపై ఇప్పటికే అమల్లో ఉన్న సస్పెన్షన్‌ను 2020, నవంబర్ 30 వరకు పొడిగిస్తున్నట్లు ది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) బుధవారం ప్రకటించింది. యూరప్ దేశాల్లో కరోనా వైరస్ మరోసారి విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు DGCA తెలిపింది. అయితే అన్ని రకాల అంతర్జాతీయ కార్గో సర్వీసులకు, తాము అనుమతించిన ప్రత్యేక విమాన సర్వీసులకు ఈ నిషేధం వర్తించదని డీజీసీఏ స్పష్టం చేసింది.
అయితే, ఎంపిక చేసిన కొన్ని ప్రత్యేక మార్గాల్లో మాత్రం అంతర్జాతీయ కమర్షియల్ విమాన సర్వీసులను అనుమతిస్తున్నట్లు DGCA పేర్కొన్నది. కాగా, కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది మార్చి 23న అంతర్జాతీయ విమాన సర్వీసుల రాకపోకలపై DGCA నిషేధం విధించింది. అయితే, ఇప్పటికీ కరోనా విస్తృతి తగ్గకపోవడంతో పలు దఫాలుగా గడవును పొడిగిస్తూ వచ్చింది. ఇటీవల విధించిన నిషేధం గడువు అక్టోబర్ 31న ముగియనుండటంతో తాజాగా మరోసారి నిషేధాన్ని పొడిగించింది.
తాజా వార్తలు
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!