బహ్రెయిన్:నకిలీ బెనిఫిట్ పే ద్వారా మోసాలు..
- October 29, 2020
మనామా:బహ్రెయిన్ లో పేరుగాంచిన సంస్థల పేరుతో నకిలీ సంస్థలను సృష్టించి మోసాలకు తెగబడుతున్నారు మోసగాళ్లు. బహ్రెయిన్ ఇటీవలి కాలంలో ఆర్ధిక సంస్థల పేరు మీద వినియోగదారులకు మెసేజ్ లు పంపించటం, ఫోన్ కాల్స్ ద్వారా వారి అకౌంట్ వివరాలు సేకరించి మోసాలకు పాల్పడే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో ప్రభుత్వ అధికారులు ఎప్పటికప్పుడు నేరగాళ్ల మోసాలను పసిగడుతూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. లేటెస్ట్ గా బహ్రెయిన్ జాతీయ ఎలక్ట్రానిక్ వాలెట్ పేమెంట్ సిస్టం...బెనిఫిట్ పే పేరుతో వినియోగదారులకు మోసగాళ్లు మెసేజ్ లు పంపిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. తాము పంపించిన లింక్ ద్వారా అకౌంట్ వివరాలు, సీపీఆర్ ను అప్ డేట్ చేయాలని, లేదంటే అకౌంట్ బ్లాక్ అయ్యే ప్రమాదం ఉందంటూ వినియోగదారులను మోసం చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే..అధికారిక బెనిఫిట్ పే తరహాలోనే అచ్చుగుద్ధినట్లుగా మోసగాళ్లు నకిలీ బెనిఫిట్ పే సృష్టించారని వెల్లడించారు. వినియోగదారులు ఎట్టిపరిస్థితుల్లోనూ పాస్ వర్డ్, అకౌంట్ నెంబర్, సీపీఆర్ వివరాలను వెల్లడించొద్దని అధికారులు ప్రజలకు సూచించారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!