కువైట్:భారత్ వెళ్లాలనుకుంటున్న వారి కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం

- October 29, 2020 , by Maagulf
కువైట్:భారత్ వెళ్లాలనుకుంటున్న వారి కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం

కువైట్ సిటీ:కువైట్ నుంచి స్వదేశానికి చేరుకోవాలనుకుంటున్న భారతీయుల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది కువైట్ లోని భారత రాయబార కార్యాలయం. లాక్ డౌన్ తర్వాత కువైట్ లోనే ఉండిపోవాల్సి వచ్చిన వారిని తిరిగి స్వదేశానికి చేర్చే లక్ష్యంతో ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను చేపట్టారు. అయితే..వందే భారత్ మిషన్ తో ఇప్పటికే చాలా మందిని భారత్ కు తరలించగా..ఇంకా స్వదేశానికి వెళ్లాలని అనుకుంటున్న వారు కువైట్ లో ఎంత మంది ఉన్నారో ఓ అంచనాకు వచ్చేందుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ దోహదపడనుంది. భారత్ వెళ్లాలనుకునే వాళ్లంతా https://forms.gle/R12a8XDxYXfroXUaA లింక్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవాలని కువైట్ లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. నవంబర్ 5 లోగా తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించింది. 

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com