ఒమన్ మవసలాత్‌లో ఏసీ బస్‌స్టేషన్లు, సెపరేట్ లేన్
- February 15, 2016
ఒమన్ మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ కమ్యూనికేషన్స్ (ఎంఓటిసి) మవసలాత్ బస్సుల కోసం ఎయిర్ కండిషన్డ్ బస్ స్టేషన్స్, డెడికేటెడ్ లేన్ ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. మవసలాత్ బస్సులు ప్రారంభమైనప్పటినుంచీ వాటికి లభిస్తున్న ఆదరణతో ఈ ఆలోచన చేస్తున్నారు. రాయల్ ఒమన్ పోలీసుల సహకారంతో స్పెషల్ లేన్ ఏర్పాటు చేస్తే, దాన్ని అత్యవసర సమయాల్లోనూ వినియోగించుకోవడానికి వీలవుతుందని ట్రాన్స్‌పోర్ట్ ఎఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ కమ్యూనికేషన్స్ అండర్ సెక్రెటరీ సలీమ్ బిన్ మహమ్మద్ అల్ నౌమి చెప్పారు. తొలి 70 రోజుల్లో 600,000 మంది ప్రయాణీకులు మవసలాత్ సర్వీసులను వినియోగించుకున్నారనీ, రోజుకు సరాసరి ఈ సంఖ్య 9,000 మందిగా ఉందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. 2016 తొలి క్వార్టర్‌లో కొత్తగా రెండు రూట్స్‌ని ప్రకటించి, బస్సులను నడపనుంది. రువి - ముత్రాహ్, రువి - అల్ అమీరాత్ ఆ రెండు కొత్త రూట్లు. మవసలాత్ బస్సులను నడిపేందుకు డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ కూడా ఇవ్వనున్నారు. అలాగే రోడ్లను విస్తరించడంపైనా ఒమన్ ప్రత్యేక దృష్టిపెట్టింది.
తాజా వార్తలు
- అమరావతిలో చంద్రబాబును కలిసిన రామ్‌దేవ్
- టీటీడీ బోర్డు చైర్మన్‌గా బీఆర్ నాయుడు.. పాలకమండలి కొత్త సభ్యులు వీరే..
- ఫుట్‌బాల్ ఆటగాళ్లకు క్షమాభిక్ష ప్రసాదించిన యూఏఈ ప్రెసిడెంట్..!!
- కువైట్‌కు 4 రోజులపాటు విమాన సర్వీసులను రద్దు చేసిన ఎతిహాద్..!!
- చట్టవిరుద్ధమైన విక్రయాలు.. కార్లను తొలగించాలని నోటీసులు జారీ..!!
- కువైట్‌లోని కార్మికుల్లో అగ్రస్థానంలో భారతీయులు..!!
- మదీనాలో విమానం మెట్లపై నుంచి పడి మహిళా ప్యాసింజర్ మృతి..!!
- ఖతార్ లో మెరైన్ టూరిజం ట్రాన్స్ పోర్ట్ నిబంధనల్లో మార్పులు..!!
- రేపు తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..
- 500 ఏళ్ల తర్వాత అయోధ్య ఆలయంలో దీపావళి..