దీపావళి శుభాకాంక్షలు తెలిపిన సిఎం జగన్‌

- November 13, 2020 , by Maagulf
దీపావళి శుభాకాంక్షలు తెలిపిన సిఎం జగన్‌

అమరావతి: దీపావళి సందర్భంగా ఏపి సిఎం జగన్‌ రాష్ట్ర ప్రజలందరికీ, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పర్వదినం సందర్భంగా తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలగాలని, ప్రతి ఇంటా కోటి ఆనందాల దీపాలు వెలగాలని సిఎం ఆకాంక్షించారు. ఈ దీపావళి ప్రజల జీవితాల్లో కోటి కాంతులు నింపాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. చీకటి మీద వెలుగు, చెడు మీద మంచి, దుష్టశక్తుల మీద దైవశక్తి సాధించిన విజయానికి దీపావళి ప్రతీక అని సిఎం జగన్‌ పేర్కొన్నారు.

--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏపి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com