ఈ నెల 7 నుంచి డొమస్టిక్ వర్కర్లకు అనుమతి..కువైట్ మంత్రివర్గం నిర్ణయం

- December 01, 2020 , by Maagulf
ఈ నెల 7 నుంచి డొమస్టిక్ వర్కర్లకు అనుమతి..కువైట్ మంత్రివర్గం నిర్ణయం

కువైట్ సిటీ:కోవిడ్, ప్రయాణ ఆంక్షలతో పలు దేశాల్లో చిక్కుకుపోయిన డొమస్టిక్ వర్కర్లు ఇక కువైట్ వెళ్లేందుకు లైన్ క్లియర్ అయింది. ఈ నెల 7 నుంచి డొమస్టిక్ వర్కర్లు వచ్చేందుకు అనుమతి ఇస్తున్నట్లు మంత్రివర్గం నిర్ణయించింది. ఈ మేరకు కువైట్ అధికార ప్రతినిధి తారీఖ్ అల్ ముజ్రిమ్ మంత్రిమండలి నిర్ణయాన్ని తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో డొమస్టిక్ వర్కర్లకు సంబంధించి మార్గనిర్దేశకాలను కూడా వెల్లడించారు. వివిధ దేశాల నుంచి కువైట్ కు వచ్చే ఒక్కో గృహ కార్మికుడు క్వారంటైన్, పీసీఆర్ టెస్ట్ పాటు కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నట్లు, అందుకుగాను ఒక్కో కార్మికుడు 270 దినార్లు చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. ఈ మొత్తాన్ని విమాన టికెట్లకు అదనంగా చెల్లించాల్సి ఉంటుందని స్పష్టత ఇచ్చారు. 

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,దివాకర్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com