సతీసమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్న సైబరాబాద్ సీపీ

- December 01, 2020 , by Maagulf
సతీసమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్న సైబరాబాద్ సీపీ

హైదరాబాద్:నాంపల్లిలోని వ్యాయామ్ శాల హై స్కూల్ లో ఈరోజు ఉదయం సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ అయన సతీమని  అనుప వీ సజ్జనార్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం సీపీ మాట్లాడుతూ ఓటు ద్వారా ప్రజాస్వామ్యాన్ని గెలిపించండని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈరోజు ఎన్ని ఇతర పనులు ఉన్నప్పటికీ ప్రతిఒక్కరూ కచ్చితంగా ఓటు వేసేందుకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలను కోరారు.

హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కలిపి మొత్తం 51,000 మందితో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. సైబరాబాద్ లో ఎన్నికల కు సంబంధించి భద్రతాపరంగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.ప్రజలు స్వేచ్ఛగా, స్వతంత్రంగా, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఎలాంటి ఇబ్బంది ఉన్నా పోలీసుల దృష్టికి తీసుకురావాలన్నారు. ఓట్ ఫస్ట్.. వర్క్ నెక్స్ట్ అనే నేనాదంతో ఓటింగ్ శాతం  పెంచేందుకు ప్రజలందరూ పెద్దఎత్తున ముందుకు రావాలన్నారు. తాను ఓటు వేసిన వ్యాయామ్ శాల పాఠశాల వద్ద ఏర్పాట్లు బాగున్నాయన్నారు. ప్రజలు సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ వారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారన్నారు. నగరంలోని ప్రజలందరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఓటు హక్కును వినియోగించాలన్నారు. మాస్కులు, శానిటైజర్ వాడటంతో పాటు సోషల్ డిస్టెన్స్ పాటించాలన్నారు. ఓటింగ్ ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలందరూ సహకరించాలని కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com