రాష్ట్రంలో దేవాలయాలకు రక్షణ లేదు అన్న ప్రచారం శుద్ధ అబద్దం-ఏ.పీ డీజీపీ
- January 15, 2021
అమరావతి:ఆలయాలపై దాడుల ఘటనల్లో రాజకీయ నేతల ప్రమేయం ఉందని ఏపీ డీజీపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. 17 మంది టీడీపీ నేతలు, నలుగురు బీజేపీ నేతల హస్తం ఉందని స్పష్టం చేశారు. ఇప్పటికే 13 మంది టీడీపీ నేతలు, ఇద్దరు బీజేపీ నేతల అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు డీజీపీ సవాంగ్. ఏపీలో మతవిద్వేషాలు రెచ్చగొడితే కఠిన చర్యలు తీసుకుంటామని.. ఆలయాలపై దాడుల్ని రాజకీయం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. మతాల మధ్య వైషమ్యాలు సృష్టించేవారిపై కఠినంగా ఉంటామని పేర్కొన్నారు డీజీపీ సవాంగ్. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్చలు తప్పవని హెచ్చరించారు. ఆలయాల దాడులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ఆలయాలపై దాడుల విషయంలో దుష్ర్పచారం చేస్తున్నారని తెలిపారు. మళ్లీ ఇలాంటి ఘటనలు జరుగకుండా ఆలయాల వద్ద సీసీ కెమెరాలతో భద్రత పెంచుతున్నామని తెలిపారు. కాగా.. రామతీర్థం ఘటనతో ఏపీలో రాజకీయాలు వేడెక్కిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక