భారత్ లో వ్యాక్సినేషన్ కు బ్రేకులు..
- January 17, 2021
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా శుక్రవారం కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లో చేపట్టిన వ్యాక్సినేషన్ ప్రక్రియ నిలిపివేశారు. కొవిన్ యాప్లో తలెత్తిన సాంకేతి లోపాల కారణంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. రెండు రోజుల పాటు వ్యాక్సిన్ పంపిణీ నిలిపివేస్తున్నామని, 18వ తేదీన తిరిగి ప్రారంభిస్తామని అధికారులు వెల్లడించారు. ఒడిశాలోనూ వ్యాక్సినేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. ఒక రోజు ఆలస్యంగా టీకాను పంపిణీ చేస్తామని ఒడిశా అధికారులు వెల్లడించారు. కొవిన్ యాప్ తలెత్తిన సమస్యలను పరిష్కరించిన తరువాతే వ్యాక్సిన్ ఇస్తామని, తొలి దశలో మొత్తం 3.28 లక్షల మందికి టీకా ఇస్తామని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ అదనపు ముఖ్య కార్యదర్శి ప్రదీప్త మోహపాత్ర వెల్లడించారు.
పశ్చిమ బెంగాల్లో కూడా ఇదే తరహా సమస్య ఏర్పడింది. వ్యాక్సిన్ తీసుకున్న వారి వివరాలు అప్లోడ్ కాలేదు. తమిళనాడులోని నీలగిరిలో పలువురికి వ్యాక్సినేషన్ ఎకనాలెడ్జ్మెంట్ను అధికారులు ఇవ్వలేకపోయారు. కొవిన్ యాప్ ద్వారా వెళ్లిన మెసేజ్లు టీకా తీసుకున్న వారికి అందడం లేదని పంజాబ్ అధికారులు సైతం ఆరోపించారు. హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకల్లోనూ వెబ్సైట్ మొరాయించింది. అయినా తాము టీకా ఇచ్చే ప్రక్రియను ఆపడం లేదని ఆయా రాష్ట్రాల అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!
- న్యూయార్క్ డిక్లరేషన్ ను స్వాగతించిన ఒమన్..!!
- తట్టై హిందూ కమ్యూనిటీ రక్తదాన శిబిరం..!!
- AI ఉపయోగించి కాపీరైట్ ఉల్లంఘన.. SR9000 జరిమానా
- ఖతార్ పీఎం తో అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ సమావేశం..!!
- కువైట్ లో 269 మంది అరెస్టు..!!
- మహిళల హకీ ఆసియా కప్లో ఫైనల్కు భారత్
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!