టాటా పేరుతో డేటా దోపిడీ...

- February 03, 2021 , by Maagulf
టాటా పేరుతో డేటా దోపిడీ...

సంధర్భంభాలను అవకాశంగా మలుచుకుని డేటా చోరీకి పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు. ఫిబ్రవరి వచ్చిందంటే చాలు అందరికీ గుర్తుకు వచ్చేది వాలంటైన్స్ డే.ప్రేమికుల రోజును ఆసరాగా చేసుకుని ప్రముఖ టాటా సంస్ధ పేరుతో డేటా చౌర్యానికి తెగబడ్డారు కేటుగాళ్లు.

కొన్ని ప్రశ్నలను వాట్సప్ లో పంపించి వాటికి సమాధానాలు చెపితే వాలంటైన్స్ డే రోజున  ఎంఐ 11టీ ఫోన్ గెలుచుకోవచ్చని మెసేజ్ లు పంపిస్తున్నారు.వాటి లింక్ నొక్కారో మీ లాప్ టాప్, ఫోన్ లోని డేటా అంతా చోరీకి గురవుతుందని సైబర్ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు.యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచిస్తారు. టాటా ప్రమోషన్‌ను ఐదు వాట్సాప్‌ గ్రూపులు లేదా 20 మంది స్నేహితులకు పంపించాలనే ఉంటుంది.ఆ తర్వాత ఏం జరుగుతుందంటే..? ఈ మెస్సేజ్‌ వాట్సప్‌లో వైరల్‌ అవుతుంది.

అది డౌన్ లోడ్ చేసుకున్నారంటే మీ ఫోన్,ల్యాప్ టాప్ లోని డేటా అంతా చోరీ చేస్తారు కేటుగాళ్లు.దీనితోపాటు మీ బ్యాంకు సమాచారం మొత్తం కేటుగాళ్లకు చేరుతుంది.టాటా ప్రమోషన్ ను ఐదు వాట్సప్  గ్రూపుల్లోకి గానీ,లేదా 20 మంది స్నేహితులకు కానీ పంపించాలనే సూచనతో  సైబర్ నేరగాళ్లు లింక్ పంపుతున్నారని….వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com