కువైట్:కోవిడ్ ప్రభావంతో బీచ్ లు, ఇతర ప్రాంతాల్లో టెంట్ల తొలగింపు

- February 10, 2021 , by Maagulf
కువైట్:కోవిడ్ ప్రభావంతో బీచ్ లు, ఇతర ప్రాంతాల్లో టెంట్ల తొలగింపు

కువైట్ సిటీ:కువైట్ వ్యాప్తంగా బీచ్ లు, ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన తాత్కాలిక టెంట్లను తొలగిస్తున్నారు అధికారులు. సెకండ్ వేవ్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో కోవిడ్ కట్టడికి టెంట్లను అనుమతించటం లేదని స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్య భద్రతకు మంత్రివర్గం తాత్కాలిక ప్రాతిపదికన చేపట్టిన చర్యల మేరకు టెంట్ల ఏర్పాటు చట్ట వ్యతిరేకమనే విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. జహ్రా మున్సిపాలిటి పరిధిలో క్లీనింగ్, రోడ్ వర్క్స్ డిపార్ట్మెంట్ టెంట్ల ఏర్పాటును అడ్డుకునేందుకు బృందాలను ఏర్పాటు చేసింది. సుప్రీం కమిటీ సూచనల ప్రకారం ఒకే చోట పరిమితికి మించి జనం గుమికూడటం నేరమని..టెంట్ల ఏర్పాటుతో అంతా ఒకే చోటుకు చేరే అవకాశాలు ఉన్నందున నిబంధనను సడలించే వరకు ఎవరూ టెంట్లు ఏర్పాటు చేయవద్దని అధికారులు సూచించారు. అయితే...ఈ చర్యలు తాత్కాలికమేనని గుర్తుంచుకోవాలని..పరిస్థితులు చక్కబడిన తర్వాత మళ్లీ సాధారణ జనజీవనం కొనసాగించొచ్చన్నారు. అప్పటి వరకు ప్రజలు ప్రభుత్వ సూచనలు పాటించి సమాజ శ్రేయస్సుకు బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com