అరకు ఘాట్ రోడ్డులో ఘోర బస్సు ప్రమాదం...
- February 12, 2021
అరకు:విశాఖపట్నం జిల్లా అరకు ఘాట్ రోడ్డులో అదుపుతప్పిన టూరిస్ట్ బస్సు... లోయలోకి దూసుకెళ్లింది.. అనంతగిరి మండలం డముకలోని ఐదో నంబర్ మలుపు దగ్గర ఈ ప్రమాదం జరిగింది.అరకు వెళ్లిన పర్యాటకులు... తిరుగు ప్రయాణం అయిన సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది.ఇది హైదరాబాద్‌కు చెందిన టూరిస్టుల బస్సుగా చెబుతున్నారు.. స్థానికుల సమాచారంతో సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు...
క్షతగాత్రులను 108 సహాయంతో ఎస్.కోట ఆస్పత్రికి తరలిస్తున్నారు.అయితే, ప్రమాద సమయంలో 30 మంది పర్యాటకులు ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం.. 8 మంది మృతిచెందగా... 20 మందికిపైగా తీవ్రగాయాలపాలైనట్టు తెలుస్తోంది. అయితే, ఈ ప్రమాదాన్ని చూస్తే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు అధికారులు. మొత్తంగా మృతులంతా హైదరాబాద్‌కు చెందినవారిగానే చెబుతున్నారు పోలీసులు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష