విదేశీయుల్ని పెళ్ళాడిన సౌదీలకు ట్రావెల్ రిస్ట్రిక్షన్స్ నుంచి వెసులుబాటు

- February 25, 2021 , by Maagulf
విదేశీయుల్ని పెళ్ళాడిన సౌదీలకు ట్రావెల్ రిస్ట్రిక్షన్స్ నుంచి వెసులుబాటు

రియాద్:విదేశీయుల్ని పెళ్ళాడిన సౌదీలకు తమ బోర్డర్ ద్వారా ప్రయాణించేందుకు సంబంధించి కొన్ని వెసులుబాట్లు కల్పిస్తూ సౌదీ అరేబియా నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ విమాన ప్రయాణాలు కరోనా పాండమిక్ నేపథ్యంలో దెబ్బతినడం వల్ల తలెత్తిన ఇబ్బంది నుంచి ఈ వెసులుబాటు వారికి లభిస్తుంది. మ్యారేజ్ సర్టిఫికెట్ సహా సంబంధిత ఆధారాల్ని సమర్పించడం ద్వారా విదేశీయుల్ని పెళ్ళాడిన సౌదీ మహిళలు, దేశంలోకి రావడానికి వెసులుబాట్లు కల్పించేలా రాయల్ డిక్రీ విడుదల చేశారు. సౌదీ పురుషులకు కూడా ఇది వర్తిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com