వలసదారులు క్వాలిఫికేషన్ సర్టిఫికెట్లను సమర్పించాలి

- March 10, 2021 , by Maagulf
వలసదారులు క్వాలిఫికేషన్ సర్టిఫికెట్లను సమర్పించాలి

బహ్రెయిన్: 2006 లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ చట్టానికి సంబంధించి సవరణ బిల్లుని హౌస్ ఆఫ్ రిప్రెజెంటేటివ్స్ ఆమోదించడం జరిగింది. వలస కార్మికులకు వర్క్ పర్మిట్లను జారీ చేసేందుకు సంబంధించి నిబంధన విషయమై ఈ సవరణ చేశారు. కొత్త ప్రపోజల్ ప్రకారం వలసదారులు, తమ అకడమిక్ అలాగే యూనివర్సిటీ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్లను సమర్పించవలసి వుంటుంది. ఈ అప్రూవల్‌ను ప్రభుత్వానికి రివ్యూ కోసం పంపిస్తారు. వలసదారులు సరైన విద్య, శిక్షణ పొంది వుండాలనీ, దానికి సంబంధించిన సరైన ఆధారాల్ని చూపించాలనీ, ప్రత్యేకంగా ఎడ్యుకేషన్, మెడికల్ మరియు ఇంజనీరింగ్ విభాగాల్లో ఇది అవసరమని ఎంపీ ఘాజి అల్ రహ్మా చెప్పారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com