పర్యావరణ నానో మెట్రిక్ శాటిలైట్ ప్రయోగించనున్న యూఏఈ

- March 10, 2021 , by Maagulf
పర్యావరణ నానో మెట్రిక్ శాటిలైట్ ప్రయోగించనున్న యూఏఈ


యూఏఈ, నానో మెట్రిక్ శాటిలైట్‌ను పర్యావరణ సంబంధిత సవాళ్ళ నేపథ్యంలో ప్రయోగించనుందని దుబాయ్ మీడియా కార్యాలయం పేర్కొంది. డిఎంశాట్1, ఈ రీజియన్‌లో ఈ విభాగానికి సంబంధించి తొలి శాటిలైట్‌గా చెబుతున్నారు. అర్బన్ పొల్యూషన్, వాతావరణ మార్పులు అలాగే, దుబాయ్‌లో పర్యావరణ పరంగా ముందస్తు హెచ్చరికల వ్యవస్థను బలోపేతం చేసేలా ఇది పనిచేస్తుంది. మార్చి 20న కజకిస్తాన్‌లోని బైకనూర్ కాస్మోడ్రోమ్ నుంచి ఈ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తారు. ఎనర్జీ స్ట్రాటజీ 2050కి సంబంధించి యూఏఈ ఈ ప్రయోగంతో కీలకమైన ముందడుగు వేసినట్లవుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com