2020లో రోడ్డు ప్రమాదాల్లో తగ్గిన మృతుల సంఖ్య
- March 10, 2021
ఖతార్: ఖతార్లో గతేడాది రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన సంఖ్య తగ్గిందని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. 2019లో 154 మంది రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందితే..2020లో ఆ సంఖ్య 138కి తగ్గటం ఊరటనిచ్చే అంశమని అధికారులు పేర్కొన్నారు. గతేడాది రోడ్డు ప్రమాదాల్లో మృతిచెందిన 138 మందిలో 69 మంది మోటరిస్టులు, 26 మంది ప్రయాణికులు, 43 మంది పాదాచారులు అని వెల్లడించారు. 2015 నుంచి గణాంకాలను పరిగణలోకి తీసుకుంటే యాక్సిడెంట్ మృతుల సంఖ్య గణనీయంగా తగ్గిందని, 2015లో 227 మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతే..గతేడాది 138 మంది చనిపోయారని తెలిపారు. గతేడాది జరిగిన యాక్సిడెంట్లలో 90.1 శాతం మైనర్ యాక్సిడెంట్లేనని, 8.2 సీరియస్ యాక్సిడెంట్లుకాగా..1.7 శాతం మంది మృతిచెందారని ట్రాఫిక్ విభాగం అధికారులు పేర్కొన్నారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్, ఇతర వాహనాలతో తగిన డిస్టెన్స్ మెయిన్టేట్ చేయకపోవటం కారణంగానే రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలని వివరించారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







