మార్చి 25 నుంచి 27 వరకు దుబాయ్‌లో ఫ్రీ పార్కింగ్

- March 25, 2021 , by Maagulf
మార్చి 25 నుంచి 27 వరకు దుబాయ్‌లో ఫ్రీ పార్కింగ్

దుబాయ్:పబ్లిక్ పార్కింగ్ దుబాయ్ వ్యాప్తంగా మూడు రోజులపాటు ఉచితం కాబోతోంది. మార్చి 25 నుంచి 27 వరకు ఈ ఉచిత పార్కింగ్ వర్తిస్తుందని దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ వెల్లడించింది. అయితే మల్టీ లెవల్డ్ పార్కింగ్ మాత్రం ఉచితం కాదు. యాప్ ద్వారా తమ వినియోగదారులకు ఆర్‌టిఎ ఈ మేరకు సమాచారం పంపించింది. దుబాయ్ డిప్యూటీ రూలర్, యూఏఈ మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ షేక్ హమదాన్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ మరణం నేపథ్యంలో అన్ని ప్రభుత్వ శాఖలు, సంస్థలకు సెలవు నేపథ్యంలో దుబాయ్ రూలర్ కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. బుధవారం షేక్ హమదాన్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ మృతి చెందారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com