తెలంగాణలో కరోనా కేసుల వివరాలు

- April 01, 2021 , by Maagulf
తెలంగాణలో కరోనా కేసుల వివరాలు

హైదరాబాద్:తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.తాజాగా తెలంగాణ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను విడుదల చేసింది.ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 887 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,08,776కి చేరింది.ఇందులో 3,01,564 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 5511 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.  ఇక తెలంగాణలో కరోనాతో నలుగురు మృతి చెందారు.దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1701కి చేరింది.ఇక ఇదిలా ఉంటె, రాష్ట్రంలో కేసుల సంఖ్య సంఖ్య పెరుగుతుండటంతో ఆరోగ్యశాఖామంత్రి ఈటల రాజేందర్ ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించబోతున్నారు.రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, వ్యాక్సినేషన్ ప్రక్రియపై సమీక్షను నిర్వహిస్తున్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com