'వకీల్ సాబ్' మూవీ రివ్యూ
- April 09, 2021
నటీనటులు: పవన్ కళ్యాణ్, శృతిహాసన్, నివేద థామస్, అంజలి, అనన్య, ప్రకాష్ రాజ్ తదితరులు..
ఎడిటర్: నవీన్ నూలీ
సంగీతం: తమన్
రచన, దర్శకత్వం: శ్రీరామ్ వేణు
నిర్మాతలు: రాజు, శిరీష్
పవన్ కళ్యాణ్ నుంచి మూడేళ్ల తర్వాత వచ్చిన సినిమా వకీల్ సాబ్. అభిమానులు ఆయనను ఎంతగా మిస్ అవుతున్నారు అనేది ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే అర్ధం అవుతుంది. మరి వకీల్ సాబ్ ఎలా ఉన్నాడు వాదించాడా లేదా..
కథ:
జనం కోసం ఏదో ఒకటి చేయాలని తపించే మనిషి సత్యదేవ్ (పవన్ కళ్యాణ్). అందుకే న్యాయవాది అవుతాడు. అదే సమయంలో శృతి హాసన్ ఆయన జీవితంలోకి వస్తుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని కారణాలతో న్యాయవాద వృత్తికి దూరంగా ఉంటారు. హైదరాబాద్ లో ఒక కాలనీలో ఉంటాడు అదే సమయంలో ముగ్గురు అమ్మాయిలు అంజలి(జరీనా), అనన్య(దివ్య), నివేద (పల్లవి) ఒక కేసులో ఇరుక్కుంటారు. అందులో నివేదా థామస్ ను జైల్లో పెడతారు. ఎంపీ కొడుకు కేసు కావడంతో ఆమెకు బెయిల్ రాకుండా చేస్తారు. అలాంటి సమయంలో సత్యదేవ్ వాళ్ళకు సాయం చేస్తాడు. అది నచ్చని ఎంపీ అతడిని భయపెట్టాలని చూస్తాడు. దాంతో ఆ కేసును తానే టేకప్ చేస్తాడు సత్యదేవ్. కోర్టులో డిఫెన్స్ లాయర్ నందగోపాల్ (ప్రకాష్ రాజ్) ఎంపీ కొడుకు కేసు వాదిస్తుంటాడు. ఈ కేసులో చివరికి ఏమైంది అనేది అసలు కథ..
కథనం:
ఈ సినిమా కథ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. పింక్ సబ్జెక్ట్ అందరికీ తెలుసు. తెలుగులో కూడా పెద్దగా మార్పులు చేయలేదు. ముఖ్యంగా ఫస్టాఫ్ చాలా వరకు ఒరిజినల్ ని ఫాలో అయిపోయారు. కాకపోతే పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ విషయంలో మాత్రం కాస్త నిడివి పెంచారు. దాని కోసం కొన్ని సన్నివేశాలు అల్లుకున్నారు. ఫస్టాఫ్ లొనే శృతి హాసన్ ఎపిసోడ్ పూర్తి చేశారు. సినిమా టేకాఫ్ అవడమే కథలోకి వెళ్ళిపోతుంది. ఎక్కడ టైం వేస్ట్ చేయలేదు దర్శకుడు వేణు శ్రీరామ్. మొదట్లో పింక్ సినిమా ఉన్నది ఉన్నట్లు తెరకెక్కించాడు వేణు శ్రీరామ్. మూల కథ మార్చడానికి ఆయన సాహసం చేయలేదు. కాకపోతే ఉన్న కథలో కమర్షియల్ అంశాలు మరిన్ని జోడించి పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ను ఆయన తీర్చిదిద్దిన విధానం అభిమానులకే కాదు అందరికీ నచ్చుతుంది. ఫస్టాఫ్ కాస్త నెమ్మదిగా సాగుతుంది. దానికి తోడు కథ కూడా తెలిసింది కావడంతో అంత వేగంగా అనిపించదు. పవన్ కళ్యాణ్ కనిపించిన ప్రతిసారి అదిరిపోతుంది. సినిమా మొదలైన 15 నిమిషాలకు పవన్ వస్తాడు. తాగుబోతు లాయర్ గా.. అన్యాయం జరిగితే ఎదురుతిరిగే వ్యక్తిగా పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ డిజైన్ చేశాడు దర్శకుడు వేణు శ్రీరామ్. కాకపోతే ఆయన ఎందుకు అలా మారాల్సి వచ్చింది అనే దానికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది. అది పెద్దగా ఆసక్తికరంగా అనిపించదు.
ఫ్లాష్ బ్యాక్ అయిన తర్వాత మళ్లీ అసలు కథలోకి వచ్చేస్తారు. అలాగే యాక్షన్ సన్నివేశాలు కూడా చాలా బాగున్నాయి. మరోవైపు జనసేన పార్టీని కూడా ఈ సినిమాలో బాగానే ప్రమోట్ చేశారు. అది అభిమానులకు బాగానే ఉంటుంది కానీ బయటి వాళ్లకు కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇంటర్వెల్ ముందు వరకు కూడా సినిమా కాస్త నెమ్మదిగా సాగుతుంది. పవన్ ఒక్కసారి కేసు తీసుకున్న తర్వాత సినిమా స్థాయి పెరుగుతుంది. ముఖ్యంగా సెకండాఫ్లో వాదన ప్రతిపాదనలతో కోర్టు సీక్వెన్స్ దద్దరిల్లిపోయింది. ఆలోచింపచేసే మాటలతో వకీల్ సాబ్ అందర్నీ ఆకట్టుకుంటాడు. అమ్మాయిలకు విలువ ఇవ్వాలి.. వాళ్ళ భావాలను కూడా పట్టించుకోవాలి.. దాడులు జరిగినపుడే హడావిడి చేసేకంటే కూడా అమ్మాయిలకు భద్రత అనేది ఉండాలి అనేది ఈ సినిమాలో చూపించారు. మరీ ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ లో వచ్చే పవన్ కళ్యాణ్ డైలాగ్ లు చాలా బాగున్నాయి. ఓవరాల్ గా ఫస్టాఫ్ యావరేజ్ గా ఉన్న సెకండాఫ్ ఆలోచింప చేశాడు వకీల్ సాబ్.
నటీనటులు:
పవన్ కళ్యాణ్ నటన గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ఆయన స్క్రీన్ పై కనిపిస్తే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. వకీల్ సాబ్ సినిమాలో కూడా ఇదే చేసాడు. ఆయన సత్యదేవ్ పాత్రకు ప్రాణం పోసాడు. ఆలోచింపజేసే డైలాగులతో పాటు యాక్షన్ సన్నివేశాలతోనూ అదరగొట్టాడు. శృతి హాసన్ చిన్న పాత్రలో మెరిసింది. ముగ్గురు అమ్మాయిల్లో నివేదా థామస్ చాలా బాగా నటించింది. అంజలి, అనన్య కూడా పర్లేదు. ప్రకాశ్ రాజ్ పాత్ర చాలా బాగుంది. నందగా ఆయన అదరగొట్టాడు. మిగిలిన పాత్రలన్నీ ఓకే..
టెక్నికల్ టీం:
ఈ సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్ థమన్ సంగీతం. ఆయన బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాను నిలబెట్టింది. పాటలు కూడా బాగున్నాయి. మరోవైపు నవీన్ నూలి ఎడిటింగ్ కాస్త వీక్. ఫస్టాఫ్ చాలా వరకు సన్నివేశాలు బోర్ కొట్టించాయి. సెకండాఫ్ మాత్రం అదిరిపోయింది. ముఖ్యంగా పవన్ సీన్స్ అన్నీ చాలా బాగున్నాయి. కోర్టు డ్రామా నెవర్ బిఫోర్ అన్నట్లు తెరకెక్కించాడు వేణు శ్రీరామ్. దర్శకుడు వేణు కూడా చాలా బాగా టేకప్ చేసాడు ఈ సినిమాను. ముఖ్యంగా ఆల్రెడీ ప్రూవ్ అయిన సబ్జెక్టును పవన్ లాంటి హీరో ఇమేజ్‌కు తగ్గట్లు మార్పులు చేయాలంటే కష్టం. కానీ దాన్ని చాలా సింపుల్‌గా చేసాడు దర్శకుడు వేణు శ్రీరామ్. పింక్, నేర్కొండ పార్వైతో పోలిస్తే తెలుగు సినిమాలో హీరో ఎలివేషన్స్ ఇంకా ఎక్కువగా ఉన్నాయి. కథను మాత్రం ఎక్కడా డిస్టర్బ్ చేయలేదు.
చివరగా:
వకీల్ సాబ్.. పవర్ ప్యాక్డ్ మెసేజ్ ఓరియెంటెడ్..
మాగల్ఫ్ రేటింగ్: 3/5
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







