ఇపుడు జన్మించిన శిశువు వయస్సు 12 ఏళ్ళు మాత్రమె
- March 04, 2016
' కలిసొచ్చిన కాలానికి....నడిచొచ్చిన కొడుకు పుట్టేడని ' మన తెలుగునాట ఓ సామెత ఉంది. అచ్చంగా అలానే జరిగింది మన దేశానికి పొరుగున ఉన్న చైనా లో .... ఈ వార్త వివరాలలోనికి వెళితే, ఫలదీకరణ చేసి దాచబడిన ఓ అండం ఒక దశాబ్దం కంటే ఎక్కువ కాలం సంరక్షించబడిన టెస్ట్ ట్యూబ్ బేబీ రూపంలో జన్మించింది. చైనా దేశానికి చెందిన ఒక మహిళ పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ ,ఇతర సంతానోత్పత్తి సమస్యలకు బాధపడుతోంది. దీంతో ఆమె 2003 లో పిండాలను శీతలీకరణ ప్రక్రీయ ద్వారా స్తంభింప నిర్ణయించుకుంది. ఆ సమయంలో వైద్యులు 12 అండాలను తన భర్త వీర్యంతో ఫలదీకరణ చేశారు. ఆమెలో ప్రవెశ పెట్టిన పిండాల జంటలో అమర్చిన తర్వాత ఆమెకు ఒక మగ శిశువు పుట్టింది. మిగిలిన ఆమె పిండాలను తిరిగి వైద్యులు భద్రపర్చారు. ప్రస్తుతం చైనాలో ' ఒక బిడ్డ ముద్దు ....రెండోవ బిడ్డ వద్దు ' అనే నిబంధనను కొద్దిగా సడలించారు.దీంతో ఒక పుష్కర కలం తర్వాత రెండవ బిడ్డను ఆ మహిళ కనింది. 12 ఏళ్ళ తర్వాత ఘనీభవించిన పిండం శిశువుగా ( రెండో కుమారుడుగా ) జన్మించడంతో సంచలనం కల్గించందని..ఈ సందర్భంలో సంతానోత్పత్తి సమస్యలు ఎదుర్కొంటున్న అనేక జంటలు లక్షలాది ఆశ కిరణంగా మారిందని చైనా పత్రిక నివేదించింది..
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







