తమిళనాడు ముఖ్యమంత్రిగా స్టాలిన్ ప్రమాణ స్వీకారం...!

- May 07, 2021 , by Maagulf
తమిళనాడు ముఖ్యమంత్రిగా స్టాలిన్ ప్రమాణ స్వీకారం...!

చెన్నై: తమిళనాడు రాష్ట్ర 14వ ముఖ్యమంత్రిగా ఎంకే స్టాలిన్ ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ భన్వరీలాల్‌ పురోహిత్‌ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. స్టాలిన్ తో పాటుగా పలువురు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. కరుణానిధి మంత్రి వర్గంలో పనిచేసిన వారికి స్టాలిన్ అవకాశం ఇచ్చారు. మంత్రివర్గంలో ఇద్దరు మహిళలు, ఇద్దరు మైనారిటీలకి స్థానం దక్కింది. కాగా ఇటీవల ఎన్నికల్లో 234స్థానాలకి గాను డీఎంకే 133స్థానాలను గెలుచుకుంది. అన్నాడీఎంకే 66, కాంగ్రెస్‌ 18, పీఎంకే 5, బీజేపీ 4 స్థానాలకే పరిమితమయ్యాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com