కోవిడ్ నిబంధనల ఉల్లంఘనులపై నిఘా..క్షేత్రస్థాయిలో తనిఖీలు
- May 16, 2021
జెడ్డా: కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు అమలులో ఉన్న కోవిడ్ నిబంధనలను ప్రజలు ఖచ్చితంగా పాటించి తీరాలని జెడ్డా మున్సిపాలిటీ అధికారులు కోరారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిని గుర్తించేందుకు సౌదీ అధికారుల సమన్వయంతో తనిఖీలను ముమ్మరం చేసినట్లు ప్రకటించింది. ఈద్ అల్ ఫితర్ తొలి రోజున వాటర్ ఫ్రంట్ ప్రాంతాల్లో అధికార బృందాలు క్షేత్ర స్థాయి తనిఖీలు నిర్వహించినట్లు వెల్లడించింది. మొత్తం 180 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించగా 9 చోట్ల 69 ఉల్లంఘనలు జరిగినట్లు గుర్తించామని వివరించారు. మహమ్మారి విస్తృతిని నిలువరించేందుకు ప్రజలు తమ వంతు బాధ్యతగా కోవిడ్ నిబంధనలు పాటించాలని, ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే టోల్ ఫ్రీ నెంబర్ 940 ద్వారాగానీ, Balady యాప్ ద్వారాగానీ తమకు సమాచారం అందించాలని అధికారులు కోరారు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







