కరోనా కట్టడికి విశ్రాంత ఉద్యోగి విరాళం

- May 16, 2021 , by Maagulf
కరోనా కట్టడికి విశ్రాంత ఉద్యోగి  విరాళం

విజయవాడ: కోవిడ్ 19 విపత్తు సమయంలో కరోనా కట్టడికి తన వంతు సాయంగా ఆంధ్రా బ్యాంక్ విశ్రాంత ఉద్యోగి తన పెన్షన్ సొమ్ము విరాళంగా అందించి మానవీయతను చాటుకున్నారు.

ఆదివారం నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆంధ్ర బ్యాంక్ విశ్రాంత ఉద్యోగి యం.ఆర్.శేషగిరిరావు రూ.25,942/- చెక్కును జిల్లా కలెక్టర్ ఏ.యండి. ఇంతియాజ్ కు అందజేశారు.

విజయవాడ యనమలకుదురు భగత్ సింగ్ నగర్ కు చెందిన విశ్రాంత  బ్యాంక్ ఉద్యోగి యం ఆర్ శేషగిరిరావు, సాయిలక్ష్మీ విజయదుర్గా దంపతులు కోవిడ్ 19 నివారణ లో భాగంగా సహాయ చర్యల కోసం  వారి తల్లిదండ్రులు మద్దాలి సుబ్బారావు, విజయలక్ష్మి ల జ్ఞాపకార్ద0 తన ఒక నెల పెన్షన్ అందించడం పట్ల వారిని కలెక్టర్ ఏ.యండి.ఇంతియాజ్ ప్రత్యేకంగా అభినందించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com