'24' సినిమాతో సూర్య

- March 05, 2016 , by Maagulf
'24' సినిమాతో సూర్య

 సౌత్ ఇండస్ట్రీలో ప్రయోగాత్మక చిత్రాలకు రెడీగా ఉండే స్టార్ హీరో సూర్య. మరోసారి అదే ఫార్ములాతో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. సైన్స్ ఫిక్షన్ గా తెరకెక్కిన '24' సినిమాతో మరోసారి అభిమానులకు షాక్ ఇవ్వనున్నాడు. 5 వేరియేషన్స్ లో త్రిపాత్రాభినయం చేస్తున్న సూర్య ఈ సినిమాతో మరోసారి భారీ హిట్ మీద కన్నేశాడు. మనం సినిమాతో సూపర్ హిట్ కొట్టిన విక్రమ్ కుమార్, ఈ సినిమాతో అదే ఫాం కంటిన్యూ చేయాలని భావిస్తున్నాడు.శుక్రవారం రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ సినిమా మీద అంచనాలను పెంచేస్తుంది. కవల సోదరులుగా నటిస్తున్న సూర్య ఒక పాత్రలో సైంటిస్ట్ గా, మరో పాత్రలో విలన్ ఆత్రేయగా కనిపిస్తున్నాడు.
సూర్య చేసిన రిస్కీ ఫైట్స్ , సూర్య గెటప్స్ తో పాటు ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా టీజర్ రేంజ్ ను పెంచింది. సినిమా కాన్సెప్ట్ ను ఫస్ట్ టీజర్ లోనే రిలీజ్ చేసిన దర్శకుడు విక్రమ్ కుమార్ సినిమాను మరింత గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com