యాంఫిటమిన్ ట్యాబ్లెట్లను స్మగుల్ చేస్తున్న ముగ్గురి అరెస్ట్

- May 19, 2021 , by Maagulf
యాంఫిటమిన్ ట్యాబ్లెట్లను స్మగుల్ చేస్తున్న ముగ్గురి అరెస్ట్

రియాద్: 2,700,000కి పైగా యాంఫిటమిన్ ట్యాబ్లెట్లను స్మగుల్ చేస్తున్న ముగ్గరు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ నార్కోటిక్స్ కంట్రోల్ (జి.ఎన్.డి.సి.) అధికార ప్రతినిథి కెప్టెన్ మొహమ్మద్ అల్ నుజైది వెల్లడించారు. అత్యంత చాకచక్యంగా స్మగ్లింగ్ యత్నానికి అడ్డుకట్ట వేయగలిగినట్లు ఆయన వివరించారు. ట్రక్ ట్రెయిలర్ ద్వరా నిందితులు ఈ స్మగ్లింగ్ యత్నానికి పాల్పడ్డారు. జకత్, ట్యాక్స్ మరియు కస్టమ్స్ అథారిటీ (జెడ్డా కస్టమ్స్) సాయంతో స్మగ్లింగ్ గుట్టు రట్టు చేసినట్లు జి.ఎన్.డి.సి. పేర్కొంది.అరెస్టయినవారిలో ఓ సుడానీ వ్యక్తి, ఓ సిరియన్ జాతీయుడు, మరో వ్యక్తి వున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com