30 ఏళ్ళు పైబడినవారు వ్యాక్సిన్ పొందేందుకు అర్హులు

- May 19, 2021 , by Maagulf
30 ఏళ్ళు పైబడినవారు వ్యాక్సిన్ పొందేందుకు అర్హులు

దోహా: కోవిడ్ 19 వ్యాక్సిన్ పొందేందుకోసం ఇప్పటిదాకా నిర్దేశించిన వయసుని తగ్గించారు. ఇకపై 30 ఏళ్ళ వయసు పైబడినవారు కూడా వ్యాక్సిన్ పొందేందుకు అర్హులనీ, ఇది నేటి నుంచి అమల్లోకి వస్తుందని మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ తాజా ప్రకటనలో పేర్కొంది.ఈ పరిధిలోకి వచ్చేవారంతా మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వెబ్ సైట్ (www.moph.gov.qa) ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి వుంటుంది. ఇప్పటివరకు 2.1 మిలియన్ వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేయడం జరిగింది. గడచి 24 గంటల్లో 36,626 వ్యాక్సిన్లను వేయడం జరిగింది.కాగా, అర్హులైన జనాభాలో 53.8 శాతానికి వ్యాక్సినేషన్ అందించారు. 60 ఏళ్ళు పైబడిన 89.2 శాతం మందికి వ్యాక్సినేషన్ చేశారు. కాగా 12 నుంచి 15 ఏళ్ళ మధ్యగల చిన్నారులకు ఫైజర్ బయో ఎన్ టెక్ వ్యాక్సిన్ పొందడానికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమయ్యింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com