500 మందితో నాన్ వ్యాక్సినేటేడ్ ఎంట్రీ బ్యాన్ అమలు పర్యవేక్షణ
- June 27, 2021
కువైట్: కువైట్ వ్యాప్తంగా నాన్ వ్యాక్సినేటెడ్ ఎంట్రీ బ్యాన్ నేటి నుంచి అమలులోకి రానుంది. అంటే వ్యాక్సిన్ తీసుకోని వారికి పబ్లిక్ ప్రాంతాలు, షాపింగ్ మాల్స్ లోకి అనుమతి నిషేధం ఇవాళ్టి నుంచి అమలులోకి రానుంది. కేవలం వ్యాక్సిన్ తీసుకున్న వారిని మాత్రమే మాల్స్ లోకి అనుమతిస్తారు. మై కువైట్ ఐడీ లేదా ఇమ్యూన్ యాప్ ల ఆధారంగా వ్యాక్సిన్ తీసుకున్నారా..లేదా నిర్ధారించుకున్న తర్వాత యాప్ లో గ్రీన్, ఆరెంజ్ కలర్ ఉన్న వారిని మాత్రమే లోనికి అనుమతి ఇస్తారు. ఎంట్రీ బ్యాన్ పై మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసేందుకు అంతర్గత మంత్రిత్వ శాఖ 500 మంది భద్రతా సిబ్బందిని రంగంలోకి దింపింది. ఇందులో 300 మంది కువైట్‌లోని పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఎంట్రెన్స్ దగ్గర విధులు నిర్వహించనున్నారు. మరో 200 మంది చిన్న షాపింగ్ కాంప్లెక్స్ ల దగ్గర నిఘా కొనసాగిస్తారు. యాప్ లోని గ్రీన్, ఆరేంజ్ కలర్ స్టేటస్ ఉన్నవారిని మాత్రమే లోనికి అనుమతిస్తున్నారా..లేదా తనిఖీ చేస్తారు.
తాజా వార్తలు
- నువైసీబ్ బార్డర్ నుంచి కువైట్ ఎయిర్వేస్కు ఫాస్ట్-ట్రాక్ రూట్..!!
- 30 రోజుల పాటు మారిటైమ్ లైసెన్సులను రద్దు చేసిన సౌదీ..!!
- ఒమన్‌ను ముంచెత్తిన వర్షాలు..ఆరుగురి మృతి..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్..ఉచిత ప్రవేశం పునఃప్రారంభం..!!
- ప్రైవేట్ రంగానికి సాధారణ పనివేళలు పునరుద్ధరణ..!!
- వ్యాట్ ఎగవేత..వ్యాపారవేత్తకు 5 ఏళ్ల జైలుశిక్ష..!!
- క్యాండిడేట్స్ టోర్నీ నుంచి తప్పుకున్న కోనేరు హంపి
- ఘోర విమాన ప్రమాదం..110 మంది సైనికులతో వెళ్తుండగా ఘటన..
- మచిలీపట్నం రైల్వే స్టేషన్లో రెండు లిఫ్ట్‌లు–త్వరలో పూర్తి
- ఆర్బీఐ ఎంపీసీ షెడ్యూల్ విడుదల









