సమ్మర్ సెలవుల్లో విదేశాలకు వెళ్లే వారికి కొత్త సూచనలు

- July 01, 2021 , by Maagulf
సమ్మర్ సెలవుల్లో విదేశాలకు వెళ్లే వారికి కొత్త సూచనలు

దుబాయ్: సమ్మర్ సెలవుల్లో విదేశీ ప్రయాణాలకు సిద్ధం అవుతున్నారా? అయితే..ఈ జాగ్రత్తలను తప్పకుండా పాటించాలంటూ దుబాయ్ సుప్రీం కమిటీ పౌరులు, ప్రజలకు సూచించింది. సెకండ్ డోసు వేసుకున్న 14 రోజుల తర్వాతే విదేశీ ప్రయాణాలు చేయటం మంచిదని అభిప్రాయపడింది. రెండో డోసు వేసుకున్న 14 రోజుల తర్వాతే శరీరంలో రోగనిరోధక శక్తి పూర్తి స్థాయిలో పెరుగుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని పేర్కొంది. వీలైనంత వరకు విదేశాలకు వెళ్లకపోవటమే మంచిదని అభిప్రాయపడుతూనే ఒకవేళ వెళ్లాల్సి వస్తే మాత్రం కోవిడ్ ప్రోటోకాల్ తప్పకుండా పాటించాలని సూచించింది. ముఖ్యంగా కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాలను విస్మరించాలని కోరింది. అలాగే ఆయా దేశాల్లో అమలులో ఉన్న కోవిడ్ నిబంధనలను ముందే తెలుసుకొని అందుకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించింది. పబ్లిక్ ప్రాంతాలు, సందర్శన ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు భౌతిక దూరం పాటించటంతో పాటు ఫేస్ మాస్క్ విధిగా ధరించాలని సుప్రీం కమిటీ సూచించింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com