ఆరేంజ్ బాక్సుల్లో కాప్టగన్ పిల్స్..పట్టుకున్న అధికారులు
- July 01, 2021
సౌదీ: జెడ్డా నౌకాశ్రాయం ద్వారా పెద్ద మొత్తంలో నిషేధిత కాప్టగన్ పిల్స్ స్మగ్లింగ్ చేసే ప్రయత్నానికి చెక్ పెట్టారు అధికారులు. ఆరేంజ్ బాక్సుల్లో అడుగున పిల్స్ పెట్టి అధికారుల కళ్లు గప్పేందుకు ప్రయత్నించారు స్మగ్లర్లు.అయితే..బాక్సులను స్కాన్ చేసిన తర్వాత అనుమానం వచ్చి పూర్తిగా చెక్ చేయటంతో కాప్టగన్ పిల్స్ బాగోతం బయటపడింది. 4.5 మిలియన్ల పిల్స్ ను అధికారులు గుర్తించారు. అయితే..ఇవి ఎక్కడి నుంచి రవాణా అవుతున్నాయనే విషయాన్ని మాత్రం అధికారులు వెల్లడించలేదు. ఇదిలాఉంటే గత శనివారమే లెబనాన్ నుంచి 14.4 మిలియన్ల యాంఫేటమిన్ పిల్స్ ను అక్రమ రవాణా చేస్తుండగా పట్టుబడిన విషయం తెలిసిందే. ఇక గత ఏప్రిల్ లో దానిమ్మ పండ్ల బాక్సుల్లో 5.3 మిలియన్ల పిల్స్ స్మగ్లింగ్ చేస్తుండగా అధికారులు వాటిని పట్టుకున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!