విజయవాడ విమానాశ్రయం: ఈ నెల 15న నూతన రన్‌వే ప్రారంభం...
- July 01, 2021
విజయవాడ: గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం సరికొత్తగా రూపుదిద్దుకుంటోంది. ఏపీలో రెండవ అతిపెద్ద విమానాశ్రయం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. కొత్తగా అధునాతన రన్ వే నిర్మితమైంది. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఎయిర్‌పోర్టు డైరెక్టర్ గిరి మధుసూదనరావు జిల్లా కలెక్టర్‌ను కలిసి విమానాశ్రయ విస్తరణ పనుల గురించి వివరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం 700 ఎకరాల్లో విస్తరణ పనులు చేపట్టామని తెలిపారు.ఈ పనులకు సంబంధించి ఎయిర్ పోర్టు అథారిటీకి జిల్లా యంత్రాంగం అవసరమైన సహకారాన్ని అందిస్తామన్నారు.ఇంకా పెండింగ్‌లో ఉన్న భూసేకరణ, రహదారుల విస్తరణకు సంబంధించి రెవెన్యూ అధికారులతో సమీక్షించి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు.విమానాశ్రయంలో చేపట్టిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని విమానాశ్రయం సమీపంలో ఏర్పాటు చేయనున్న ప్లై ఓవర్‌కు సంబంధించి అవసరమైన ప్రతిపాదనలను కూడా సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ నివాస్ అధికారులను కోరారు.ఈ సమావేశంలో జీఎం మహ్మద్, వివిధ విభాగాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!