ఎక్స్‌పో 2020: ఆయా దేశాల జాతీయ దినోత్సవ వేడుకలు వీక్షించే అవకాశం

- July 02, 2021 , by Maagulf
ఎక్స్‌పో 2020: ఆయా దేశాల జాతీయ దినోత్సవ వేడుకలు వీక్షించే అవకాశం

యూఏఈ: ఆరు నెలలపాటు జరిగే ఎక్స్‌పో 2020లో ఆయా దేశాలకు సంబంధించి జాతీయ దినోత్సవ వేడుకల్ని తిలకించే అవకాశం సందర్శకులకు కలగనుంది. అల్ వసల్ ప్లాజా ఈ వేడుకలకు వేదిక కానుంది. ఆయా దేశాలకు చెందిన జాతీయ పతాకాలు, జాతీయ గీతాలను ప్రదర్శించేందుకు అవకాశం వుంది. తమ తమ సాంస్కృతిక కార్యకలాపాలతో ఈ వేడుకలకు కొత్త శోభను అద్దనున్నారు ఆయా దేశాల ప్రతినిథులు. ఆయా జాతీయ దినోత్సవాల్ని నిర్వహించడానికి సాంకేతికంగా వీలుపడనివారు, హానర్ డే నిర్వహించుకునేందుకు వీలు పొందుతారు. ఒకే రోజు నేషనల్ డే, హానర్ డే వుంటే, ఉదయం ఒక వేడుక, సాయంత్రం ఇంకో వేడుక నిర్వహించుకోవచ్చు. 191 దేశాలకు చెందిన కళాకారులు ఈ ఎక్స్‌పోలో పాల్గొంటారు. క్రిస్‌మస్, న్యూ ఇయర్, దివాలీ, చైనా కొత్త సంవత్సర వేడుకలు.. ఇలా చాలా ప్రత్యేకమైన వేడుకలు ఈ ఎక్స్‌పోలో అలరించనున్నాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com