సోషల్ మీడియా దుర్వినియోగం: ఏడుగురిపై చర్యలు

- August 09, 2021 , by Maagulf
సోషల్ మీడియా దుర్వినియోగం: ఏడుగురిపై చర్యలు

దోహా: సోషల్ మీడియాని దుర్వినియోగం చేసిన ఏడుగురిపై మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్‌కి చెందిన అధికారిక విభాగమొకటి పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి ఫిర్యాదు చేయడం జరిగింది. సోషల్ మీడియా వేదికగా తప్పుడు సమాచారాన్ని, రెచ్చగొట్టే సమాచారాన్ని సర్క్యులేట్ చేసినట్లు నిందితులపై అభియోగాలు మోపబడ్డాయి. సోషల్ మీడియాలో దుష్ప్రచారాన్ని సహించేది లేదనీ, సమాజంలో అలజడి సృష్టించేందుకు ప్రయత్నించేవారిపై ఉక్కుపాదం మోపడం ఖాయమని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ హెచ్చరించింది. తప్పుడు సమాచారం కనిపిస్తే, ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చునని సూచించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com