పని ప్రాంతాల్లో 100 శాతం సామర్థ్యం: సెప్టెంబర్ 5 నుంచి అమల్లోకి
- August 26, 2021
అబుధాబి: అబుధాబి పని ప్రాంతాల్లో 100 శాతం వర్క్ ఫోర్స్ సెప్టెంబర్ 5 నుంచి అమల్లోకి రానుంది.అబుధాబి ప్రభుత్వ సంస్థలు, కంపెనీలు ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురావాల్సి వుంటుంది. వ్యాక్సినేషన్ పొందిన ఉద్యోగులు, అలాగే వెసులుబాట్లు పొందినవారు తమ గ్రీన్ స్టేటస్, అల్హోసన్ యాప్ ద్వారా చూపించాల్సి వుంటుంది. వ్యాక్సినేషన్ పొందని ఉద్యోగులు కోవిడ్ 19 పరీక్షను ప్రతి ఏడు రోజులకు ఓ సారి చేయించుకోవాలి.టెస్టింగ్ చేయించుకోనివారికి పని ప్రాంతాల్లోకి అనుమతి వుండదు. వారికి యాన్యువల్ లీవ్ నుంచి కోతతోపాటుగా, నెలవారీ వేతనం నుంచి కూడా కోతలుంటాయి.వ్యాక్సినేషన్ పొందిన విజిటర్స్ అలాగే వినియోగదారులు గ్రీన్ స్టేటస్ చూపించాలి. వ్యాక్సినేషన్ పొందనివారు 48 గంటల ముందు తీసుకున్న కోవిడ్ 19న పీసీఆర్ టెస్ట్ నెగెటివ్ రిజల్ట్ చూపించాలి.చిన్న పిల్లలున్న తల్లిదండ్రులకు రిమోట్ వర్కింగ్ సౌకర్యం కల్పిస్తారు.గ్రేడ్ 10 కంటే తక్కువ వయసున్నవారి తల్లిదండ్రులకు ఇది వర్తిస్తుంది.
తాజా వార్తలు
- యూఏఈ ఉద్యోగులకు అలర్ట్: సెలవుల్లో పని చేయమని బాస్ ఒత్తిడి చేస్తున్నారా?
- సెయింట్ లూయిస్‌లో NATS ఉచిత వైద్య శిబిరం, రక్తదానం
- తెలంగాణ: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ప్రపంచ దేశాలకు ట్రంప్ వార్నింగ్
- సమిష్టి కృషితోనే స్పోర్ట్స్ మీట్ విజయవంతం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇంటి వద్దకే రైలు పార్సిల్ సేవలు!
- శ్రీవారి పుష్కరిణిలో తెప్పోత్సవాల ట్రయల్ రన్
- రైల్వే అలర్ట్.. మార్చి 1 నుంచి ‘UTS’ యాప్ క్లోజ్
- ఏప్రిల్ 1 నుంచి క్రెడిట్ కార్డ్ కొత్త రూల్స్
- విద్యార్థులకు సోషల్ మీడియా నిషేధమా? ఏపీ కీలక నిర్ణయం









