తెలంగాణలో కరోనా కేసుల వివరాలు

- August 26, 2021 , by Maagulf
తెలంగాణలో కరోనా కేసుల వివరాలు

హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు స్థిరంగా ఉన్నాయి.రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం…గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 357 కోవిడ్‌ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఒక్కరు మృతి చెందారు.ఇక, 405 మంది కోవిడ్‌ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,56,455 కు చేరగా.. రికవరీ కేసులు 6,46,344 కు పెరిగాయి.ఇప్పటి వరకు కరోనాతో మృతిచెందినవారి సంఖ్య 3,865 గా ఉంది.. కోవిడ్ బాధితుల రికవరీ రేటు 98.45 శాతంగా ఉందని.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 6,246 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని.. గత 24 గంటల్లో 81,193 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించామని బులెటిన్‌లో పేర్కొంది ప్రభుత్వం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com