బాంబు దాడిలో 13 మంది పోలీసులు దుర్మరణం
- September 05, 2021
బాగ్దాద్: ఐసిస్ ఉగ్రదాడులు రెచ్చిపోయారు. తమ ఆట కట్టించేందుకు పని చేస్తున్న పోలీసులను మట్టుబెట్టారు. పోలీసులే లక్ష్యంగా బాంబు దాడి జరిపారు. ఈ ఘటనలో ఏకంగా 13 మంది పోలీసులు కన్నుమూశారు. దీంతో ఇరాక్‌లో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. ఆ దేశంలోని కిర్కుక్ పట్టణానికి 65 కిలోమీటర్ల దూరంలోని అల్ రషద్ ప్రాంతంలో అర్ధరాత్రి ఈ దారుణ సంఘటన జరిగింది. ఆ ప్రాంతంలో ఉన్న ఫెడరల్ పోలీస్ చెక్‌పోస్టుపై ఇస్లామిక్ స్టేట్ ఆర్గనైజేషన్ ఉగ్రవాదులు బాంబు దాడి జరిపారు. ఈ ఘటనలో భద్రతా దళాలకు చెందిన 13 మంది మృతి చెందారు. మరో ముగ్గురు గాయాలపాలయ్యారని ఆ దేశ భద్రత అధికారి వెల్లడించారు. వారి దాడుల నేపథ్యంలో ఆ దేశంలో హై అలర్ట్ ప్రకటించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!