మానవ వనరుల సామర్ధ్య పెంపు లక్ష్యంగా కొత్త ప్రాజెక్ట్
- September 16, 2021
సౌదీ: భవిష్యత్తు ప్రయోజనాలకు అనుగుణంగా కింగ్డమ్ మానవ వనరుల సామర్ధ్యాన్ని పెంపొందించుకునేందుకు సౌదీ ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రకటించింది.సౌదీ విజన్ 2030 ప్రణాళికలు, స్థానికంగా& ప్రపంచవ్యాప్తంగా పౌరుల సామర్థ్యాలను బలోపేతం చేయడానికి అనుసరిస్తున్న జాతీయ వ్యూహంలో భాగంగా సౌదీ క్రౌన్ ప్రిన్స్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
విజన్ 2030లో భాగంగా 16 వ్యూహాత్మక లక్ష్యాలను సాధించడానికి 89 కార్యక్రమాలను చేపడుతున్న సౌదీ ప్రభుత్వం...భవిష్యత్తులో మానవ వనరుల కొరత లేకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది. అందులో భాగంగానే మానవ వనరుల సామర్ధ్య పెంపు పథకానికి కూడా శ్రీకారం చుట్టింది. ఈ కొత్త కార్యక్రమంలో పటిష్ట విద్యావ్యవస్థ, స్థానికంగా& ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్ కార్మిక మార్కెట్ కోసం వనరులు సిద్ధం చేయడం, జీవితకాల అభ్యాస అవకాశాలను అందించడం అనే మూడు అంశాలపై ఫోకస్ చేయనున్నారు.
తాజా వార్తలు
- 21 వేల సినిమాలు..రూ.20 కోట్ల సంపాదన షాకింగ్ విషయాలు చెప్పిన సీపీ సజ్జనార్
- కెజిబివి విద్యార్థినుల కోసం కొత్త కమాండ్ కంట్రోల్
- UNICEF ఇండియా సెలబ్రిటీ అడ్వకేట్‌గా కీర్తి సురేశ్
- యూఏఈలో ప్రవాసుల పై SIR ఎఫెక్ట్..!!
- సౌదీ అరేబియాలో 1,383 మంది అరెస్టు..!!
- జబల్ అఖ్దర్లో టూరిస్టును రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- యునైటెడ్ ఇండియన్ స్కూల్ 40వ వార్షికోత్సవ వేడుకలు..!!
- బహ్రెయిన్‌లో ఇక ఈజీగా వీసా ట్రాన్స్ ఫర్స్..!!
- ఖతార్ మ్యూజియంలో కొత్త రువాద్ రెసిడెన్సీ ఎగ్జిబిషన్లు..!!
- బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతలు ఉధృతం ఢాకాలో వరుస బాంబు పేలుళ్లు…







