తైవాన్ తమ ప్రావిన్సు: చైనా అధ్యక్షుడు
- October 09, 2021
బీజింగ్: తైవాన్ ఏకీకరణను శాంతియుతంగా చేపట్టనున్నట్లు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ తెలిపారు. తైవాన్ను తమ దేశంలో కలుపుకోవాలన్న లక్ష్యాన్ని కచ్చితంగా పూర్తి చేయాల్సిందే అని ఆయన అన్నారు. తైవాన్ ఏకీకరణను శాంతియుతంగానే సాధించాలని, వేర్పాటువాదాన్ని వ్యతిరేకించే వైభవ సాంప్రదాయం చైనా ప్రజలకు ఉన్నట్లు ఆయన పరోక్ష వార్నింగ్ కూడా ఇచ్చారు. తైవాన్ భవిష్యత్తు దేశ ప్రజల చేతుల్లోనే ఉన్నట్లు ఆ దేశాధ్యక్షుడు ప్రకటన చేసిన కొన్ని గంటల్లోనే చైనా ఈ విధంగా రియాక్ట్ అయ్యింది. తైవాన్ తనకు తాను స్వతంత్య్ర దేశంగా ప్రకటించుకున్నది. కానీ తైవాన్ తమ ప్రావిన్సు అని చైనా ఆధిపత్యం చెలాయిస్తోంది. ఇక ఏకీకరణ కోసం తైవాన్‌పై దళాలను కూడా వినియోగించేందుకు వెనుకాడేదిలేదని ఇటీవల చైనా స్పష్టం చేసింది. సుమారు 150 చైనా యుద్ధ విమానాలు ఇటీవల తైవాన్ ఎయిర్ డిఫెన్స్ జోన్లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. దీంతో తైవాన్ ఆందోళన వ్యక్తం చేసింది. 2025 నాటికి తమ దేశాన్ని చైనా ఆక్రమించేస్తుందని తైవాన్ అభిప్రాయపడింది.
1911లో జరిగిన ఉద్యమ వార్షికోత్సవం సందర్భంగా జీ జిన్‌పింగ్ మాట్లాడుతూ.. మాతృభూమిని ఏకీకరించాలన్న చరిత్రాత్మక లక్ష్యాన్ని చేరుకోవాలని, కచ్చితంగా ఆ టార్గెట్‌ను సాధిస్తామని ఆయన అన్నారు. ఒక దేశం- రెండు వ్యవస్థల విధానం ప్రకారం ఏకీకరణ ప్రశాంతంగా జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. తైవాన్ వ్యక్తిగత వేర్పాటువాదం వల్ల మాతృభూమి ఏకీకరణ సమస్యగా మారిందని, ఇది జాతీయ విధానాలకు విఘాతంగా ఏర్పడిందన్నారు. మరోవైపు ఒక దేశం- రెండు వ్యవస్థల విధానాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తైవాన్ అధ్యక్ష కార్యాలయం తెలిపింది.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







