దుబాయ్‌లో మేడమ్ టుస్సాడ్స్ వ్యాక్స్ మ్యూజియం ప్రారంభం

- October 14, 2021 , by Maagulf
దుబాయ్‌లో మేడమ్ టుస్సాడ్స్ వ్యాక్స్ మ్యూజియం ప్రారంభం

యూఏఈ: బ్లూ వాటర్స్ ఐలాండ్‌లో తొలిసారిగా దుబాయ్ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం సందర్శకుల కోసం తెరవబడింది. ఎమిరేటీ అథ్లెట్, ఒలింపిక్ వెయిట్ లిఫ్టర్ అమ్నా అల్ హద్దాద్ అలాగే రేడియో హోస్ట్ మరియు సీరియల్ ఎంటర్‌ప్రెన్యూర్ క్రిస్ ఫాడె ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. 1835లో లండన్‌లో మేడమ్ టుస్సాడ్స్ ప్రారంభమయ్యింది. ఆ తర్వాత పలు దేశాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. దుబాయ్ ఎడిషన్ అనేది 25వది. జిసిసి దేశాల్లో ఇదే తొలి మ్యూజియం. సినిమా, సంగీతం, చరిత్ర, కళ, పాప్ కల్చర్, రాజకీయాలు సహా వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల మైనపు విగ్రహాలు టు్సాడ్స్‌లో కొలువుదీరతాయి. 60కి పైగా మైనపు బొమ్మల్ని ఏర్పాటు చేశారు ప్రస్తుతం. అమితాబ్, షారుక్, సల్మాన్, కరీనా కపూర్, కత్రినా కైఫ్, మాధురీ దీక్షిత్ తదితరుల మైనపు విగ్రహాలు సందర్శకుల్ని ఆకట్టుకుంటున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com