2060 నాటికి కార్బన్ ఉద్గారాలు జీరో శాతానికి తేవటమే లక్ష్యం

- October 25, 2021 , by Maagulf
2060 నాటికి కార్బన్ ఉద్గారాలు జీరో శాతానికి తేవటమే లక్ష్యం

బహ్రెయిన్: పర్యావరణ పరిరక్షణపై బహ్రెయిన్ ప్రభుత్వం ఫోకస్ చేసింది. ప్రపంచానికి సవాల్ గా మారిన కార్బన్ ఉద్గారాల విషయంలో ప్రత్యేక కార్యాచరణను రూపొందించనున్నామని తెలిపింది. 2060 నాటికి దేశంలో కార్బన్ ఉద్గారాల విడుదలను జీరో శాతానికి తేవాలని లక్ష్యం పెట్టుకున్నట్లు బహ్రెయిన్ కేబినెట్ ప్రకటించింది. ఇందుకు తీసుకోవాల్సిన చర్యలపై పక్కా ప్రణాళికబద్ధంగా వ్యవహరిస్తామని ప్రకటించింది. అదే విధంగా సౌదీ అరేబియా కూడా 2060 నాటికి ఇదే లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. సౌదీ నిర్ణయాన్ని కూడా బహ్రెయిన్ ప్రశంసించింది. క్లైమేట్ ఛేంజ్ విషయంలో పర్యావరణ పరిరక్షణకు గల్ఫ్ దేశాలన్ని కలిసి కట్టుగా పనిచేయాల్సి ఉందని బహ్రెయిన్ కోరంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com