బహ్రెయిన్, గల్ఫ్ లో అక్రమ మానవ రవాణా ఇంటర్ పోల్ సాయం కోరిన భారత్
- March 21, 2016
ఒక ఆన్ లైన్ సెక్స్ రాకెట్ ను నిర్వహిస్తూ పలువురు మహిళలను ఆ ఉచ్చు లోనికి లాగి వారిని అక్రమంగా దేశం నుంచి తరలించిన ఒక గ్యాంగ్ ఆచూకీకై భారతదేశం అంతర్జాతీయ పోలీస్ (ఇంటర్ పోల్) సాయం కోరింది. వీరిని కొంతకాలంగా అన్వేషిస్తున్న కేరళ క్రైమ్ బ్రాంచ్ విభాగం, భారతదేశ పోలీసులు ఈ కేసులో సంబంధం ఉన్న నిందితులను పట్టుకొనేందుకు తీవ్రమైన ప్రయత్నాలు చేస్తుందని భారత్ మీడియా పేర్కొంటుంది. సుమారు 60 మంది మహిళలను ఈ సంచలనాత్మక ముఠా బహరేన్ అక్రమ రవాణా చేసినట్లు అంగీకరించారు. ఈ నేరంలో ఆరుగురు నిందితులను ఇప్పటివరకు అరెస్టు చేశారు. ఈ ఏడాది జనవరిలో బహరేన్ నివసిస్తున్న అబ్దుల్ నాజర్ మరియు షాహిదాలు పలువురు మహిళలను ఆ ఉచ్చు లోనికి లాగి వారిని అక్రమంగా దేశం నుంచి తరలించేందుకు ప్రత్యేకంగా వచ్చేరు. అయితే పోలిసుల కదలికలు పసిగట్టిన వారు ముంబై నుంచి చెన్నై పారిపోయే ప్రయత్నంలో యాంటీ టెర్రర్ స్క్వాడ్ (ఎటిఎస్) వారిని ముంబై విమానాశ్రయం వద్ద అరెస్టు చేశారు.
క్రైమ్ బ్రాంచ్ ఇంటర్ పోల్ తెలిపిన వివరాల ప్రకారం అక్రమ మానవ రవాణా ముజీబ్ నేతృత్వంలో జరిగిందని సమాచారం అందించింది. అక్బర్, జాయ్స్, జోషి, ముస్తఫా, గీత, లినీష్ మాథ్యూ, ఆశిక్ మహేష్ మను మరియు ఉన్నికృష్ణన్ మానవ రవాణా కేసులో నిందితులు. గత కొన్ని సంవత్సరాలుగా బహరేన్ కు వీరు 60 యువతులను అక్రమ రవాణా చేశారు. పోలీసు దర్యాప్తు ప్రకారం ఈ మహిళలను భారతదేశం వివిధ విమానాశ్రయాల నుంచి కొందరు అధికారులు సాయంతో అక్రమ రవాణా చేసినట్లు వారు తెలియజేసాడు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







