ఐదేళ్ళ లోపువారికి ప్రత్యేక ప్రయాణ నిబంధనలు విడుదల చేసిన ఇండియా

- November 13, 2021 , by Maagulf
ఐదేళ్ళ లోపువారికి ప్రత్యేక ప్రయాణ నిబంధనలు విడుదల చేసిన ఇండియా

భారతదేశం, అంతర్జాతీయ ప్రయాణీకులకు తాజా గైడ్ లైన్స్ విడుదల చేయడం జరిగింది. ఐదేళ్ళ లోపు చిన్నారులకు ప్రయాణానికి ముందు, ప్రయాణం తర్వాత చేసే టెస్టింగ్ నుంచి వెసులుబాటు కల్పిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. హోం క్వారంటైన్ సమయంలో కోవిడ్ లక్షనాలు కనిపిస్తే, వారికి టెస్ట్ అలాగే వైద్య చికిత్స అనేవి ప్రోటోకాల్ ప్రకారం నిర్వహిస్తారు. ప్రయాణీకులంతా ఫేస్ మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. విమానం లోపల నిబంధనలు ఉల్లంఘిస్తే, వారిని విమానం నుంచి దించేస్తారు, వారి ప్రయాణానికి అనుమతినివ్వరు. సివిల్ ఏవియేషన్ రిక్వైర్మెంట్స్ సెక్షన్ 3 సిరీస్ ఎం పార్ట్ 6 ప్రకారం తగిన చర్యలు తీసుకుంటారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com